న‌వంబ‌రులో సాగ‌రిక‌ను పెళ్లాడ‌నున్న జ‌హీర్‌

Sagarika Ghatge To Marry Cricketer Zaheer Khan on November 27

Posted September 14, 2017 at 15:22 

మ‌రో క్రికెట‌ర్, బాలీవుడ్ హీరోయిన్ ప్రేమ పెళ్లిపీట‌లెక్కుతోంది. భార‌త మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్ త్వ‌ర‌లోనే చ‌క్ దే ఇండియా న‌టి సాగ‌క‌రిక‌ను పెళ్లిచేసుకోనున్నాడు. న‌వంబ‌రులో వారి పెళ్లి జ‌ర‌గనుంది. వివాహ తేదీ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ…రిసెప్ష‌న్ డేట్ ను మాత్రం ప్ర‌క‌టించారు. న‌వంబ‌రు 27న రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ముంబై,పుణెల్లో రిసెప్ష‌న్ ఏర్పాటుచేయ‌నున్నారు. జ‌హీర్ స్నేహితులు, స‌న్నిహితులు రిసెప్ష‌న్ కు హాజ‌రు కానున్నారు. జ‌హీర్, సాగ‌రికల‌కు ఆరు నెల‌ల క్రిత‌మే ఎంగేజ్ మెంట్ జ‌రిగింది. యువ‌రాజ్ సింగ్‌, హ‌జ‌ల్ కీచ్ వివాహ వేడుక‌కు వారిద్ద‌రూ క‌లిసి హాజ‌రయ్యారు. త‌మ‌కు నిశ్చితార్థం జ‌రిగిన‌ట్టు ఈ ఏడాది ఏప్రిల్ 25న జ‌హీర్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. జహీరే త‌న‌కు ముందు ప్ర‌పోజ్ చేశాడ‌ని సాగ‌రిక ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఐపీఎల్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక‌రోజు జ‌హీర్ సాగ‌రిక‌ను గోవా తీసుకెళ్లి ప్ర‌పోజ్ చేశాడు. జహీర్ ప్ర‌పోజ‌ల్ ను సాగ‌రిక అంగీక‌రించ‌డంతో ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత పెద్ద‌ల స‌మ‌క్షంలో వారి ఎంగేజ్ మెంట్ జ‌రిగింది. క్రికెట‌ర్లు, బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లిచేసుకోవ‌టం ఎన్నో ఏళ్లుగా జ‌రుగుతోంది. మ‌న్సూర్ ఆలీఖాన్ ప‌టౌడీ, ష‌ర్మిలా ఠాగూర్‌, అజారుద్దీన్, సంగీతా బిజిలానీ, హ‌ర్భ‌జ‌న్ సింగ్, గీతా బ‌స్రా వంటి జంట‌లు ఈ కోవకే చెందుతారు.మ‌రి.. చాలా ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న విరాట్ కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ ఎప్పుడు పెళ్లిపీట‌లెక్కుతారో చూడాలి.

మరిన్ని వార్తలు:

బార్ బాబా సపోర్ట్ తో బయటపడ్డ నిత్యానంద.

కన్నా సేఫ్ గేమ్ .

లక్ష్మీపార్వతికి రజని సారీ చెప్పాడా ?

SHARE