మోదుగుల యాక్టింగ్ కి టీడీపీ క్యాడర్ షాక్.

TDP leaders shocked to modugula venugopala reddy acting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2014 లో టీడీపీ కి అధికారం వచ్చిన కొద్ది రోజుల నుంచే ప్రభుత్వ కార్యక్రమాల మీద ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఎక్కువ విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో గట్టి పోరాటం చేశాడన్న కారణంగా మోదుగులకి చంద్రబాబు బాగా ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే సొంత బావ అయోధ్య రామిరెడ్డి మీద పోటీకి మాత్రం బాబు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గుంటూరు ఎమ్మెల్యే టికెట్ తో సరిపెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల మంత్రి పదవి ఆశించారు. అయితే వివిధ సమీకరణాలతో అది కుదరలేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. బాబు నచ్చజెప్పడంతో అప్పటికి కూల్ అయ్యారు.

రాజధాని అమరావతికి పాలన మారినప్పటినుంచి గుంటూరు లో ఆది నుంచి టీడీపీ లో ఉంటున్న నాయకులకు అధిష్టానంతో సంబంధాలు పెరిగాయి. దీంతో కొందరు మోదుగులని ఇగ్నోర్ చేశారు. అది సహించలేక, ఆ నాయకులని కట్టడి చేయలేక మోదుగులకి అసహనం పెరిగింది. దీంతో ప్రభుత్వ పధకాలు, వాటి నిర్వహణ మీద తరచుగా విమర్శలు చేయడం మొదలెట్టారు. వైసీపీ లోకి జంప్ చేయడానికి లోపాయికారీగా మంతనాలు కూడా సాగించినట్టు తెలుస్తోంది. ఇక ప్రజల్లోనూ టీడీపీ మీద వ్యతిరేకత, వైసీపీ మీద అనుకూలత పెరిగినట్టు కూడా మోదుగుల నమ్మారు. అందుకే టీడీపీ ని ఇబ్బందిపెట్టే కామెంట్స్ జోరు పెంచారు. అయితే అయ్యవారు అనుకున్నట్టు అంతా నల్లేరు మీద నడక కాలేదు.

నంద్యాల ఎన్నికల ఫలితం, కాకినాడ రిజల్ట్ చూసాక మోదుగుల మైండ్ బ్లాక్ అయ్యిందట. అందుకే అర్జెంట్ గా సీన్ పేపర్ మార్చేశాడు. గుంటూరు లో ఇంటిటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎక్కడ లేనంత ఆర్భాటంగా చేస్తున్నారు. చంద్రబాబుని పొగడ్డం లో రేసు గుర్రంలా దూసుకుపోతున్నారు. ఇక అంతటితో ఆగలేదు. ఒకప్పుడు దూరం చేసుకున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులతో ఎప్పుడూ ఏమీ జరగనట్టు పలకరించేస్తున్నారు.ఇది చూసి టీడీపీ క్యాడర్ షాక్ అవుతున్నారు. ఇదంతా జాగ్రత్తగా పరిశీలించిన ఓ టీడీపీ చోటా నాయకుడు మోదుగుల యాక్టింగ్ అదిరిపోతోందిగా అంటూ కామెంట్ చేశారట. ఆ మాట విని మోదుగుల ముఖ్య అనుచరులు కూడా నోరు మెదపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఎంతైనా నిజాలు దాచేస్తే దాగుతాయా ?

మరిన్ని వార్తలు:

కొత్త కాపు రాబోతున్నాడు.

కన్నా సేఫ్ గేమ్ .

లక్ష్మీపార్వతికి రజని సారీ చెప్పాడా ?