నిరాశ పర్చిన ‘జవాన్‌’ టీజర్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jawan teaser

‘విన్నర్‌’ చిత్రంతో ఆకట్టుకోలేక సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం బివిఎస్‌ రవి దర్శకత్వంలో ‘జవాన్‌’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. వాంటెడ్‌ చిత్రంతో దర్శకుడిగా మారి సక్సెస్‌ కాలేకపోయిన రవి మలి ప్రయత్నంగా ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై మొదటి నుండి కూడా అంచనాలు పెద్దగా లేవు. దర్శకుడు ఈ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తాడని సినీ వర్గాల వారు కూడా భావించడం లేదు. సినిమా విడుదలకు సిద్దం అయినా కూడా ఇంకా ఎవరు దీని గురించి మాట్లాడుకోవడం లేదు. సినిమా ఫస్ట్‌లుక్‌ సమయంలో కూడా ఎవరు పెద్దగా ఈ సినిమాను పట్టించుకోలేదు. తాజాగా టీజర్‌ విడుదలైంది. 

టీజర్‌ సాదా సీదాగా ఉంది, ఏమాత్రం ఆకట్టుకునే అంశాలు కనిపించడం లేదు. ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా అనిపిస్తుంది. దేశ భక్తి నేపథ్యం సినిమా అవ్వడంతో కాస్త ఆసక్తి అనిపిస్తున్నా కూడా రొటీన్‌ విజువల్స్‌ మరియు రొటీన్‌ డైలాగ్స్‌తో టీజర్‌ ఆకట్టుకోలేక పోయింది. టీజర్‌తో అయినా సినిమా గురించి మాట్లాడుకుంటారని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించారు. కాని ఇప్పుడు కూడా ప్రేక్షకులు  ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారనే హోప్స్‌ లేవు. ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌కు జోడీగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కారణంగా బిజినెస్‌ బాగానే జరగవచ్చు అని అంటున్నారు.

 

మరిన్ని వార్తలు:

ఇలా పూరికి మాత్రమే సాధ్యం

మళ్లీ ‘జై లవకుశ’కు లీక్‌ సమస్య

పోసానిపై వర్మ ఘాటు వ్యాఖ్యలు