ఏంటీ… శర్వా ప్రేమకథలో భూకంపమా…!

Sai-Pallavi-And-Sharwanand-

విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తనకు సరిగ్గా సరిపోయే పాత్రల్లో జీవించి పోయే శర్వా చిత్రాలపై ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది అనడంలో సందేహం లేదు. శర్వానంద్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో శర్వా సరసన సాయి పల్లవి రొమాన్స్‌ చేసింది. ఈ చిత్రంలో శర్వా పుట్‌బాల్‌ ప్లేయర్‌గా నటించగా సాయి పల్లవి మెడికోగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

padi-lechave

ఇటీవల విడుదలైన శర్వా టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఒక రొమాంటిక్‌ ప్రేమ కథగా ఈ టీజర్‌లో చూపించారు. దాంతో యూత్‌ అభిమానులకు ఆసక్తి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నేపాల్‌లో వచ్చిన భూకంపం నేపథ్యంలో ఉండబోతుంది అని తెలుస్తోంది. 2015లో వచ్చిన భూకంపం వల్ల నేపాల్‌లో 9వేల మంది మరణించారు, 22వేల మంది గాయపడ్డారు. దాంతో ప్రపంచ దేశాలన్నీ కూడా నేపాల్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఈ చిత్రంలో ఇండియన్‌ ఆర్మీ వ్యవహరించిన తీరు చూపించబోతున్నట్టు సమాచారం. ప్రేమ కథ అనుకున్న ఈ చిత్రం భూకంపం నేపథ్యంలో అనగానే శర్వా అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.

Sai-Pallavi-And-Sharwanand