మీడియాకు ప్రభాస్‌ మందు పార్టీ…!

Celebrity Wishes For Bahubali Hero Prabhas

స్టార్స్ అంతా కూడా మీడియాతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అప్పుడప్పుడు ప్రత్యేక పార్టీలను అరేంజ్‌ చేస్తారు. తాజాగా ప్రభాస్‌ తన 39వ బర్త్‌ డే సందర్భంగా మీడియా మిత్రులకు పార్టీని అరేంజ్‌ చేశాడు. సీనియర్‌ జర్నలిస్ట్‌కు, ఫొటోగ్రాఫర్స్‌ కోసం ఈ పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రభాస్‌ టీం ఈ రోజు రాత్రి హైద్రాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో బర్త్‌డే పార్టీ మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్నారు.

Prabhas Plans A Surprise For Fans On His Birthday

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. సుజిత్‌ దర్శకత్వంలో దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘పాహో’ చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈరోజు ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అందుకు సంబధించిన మేకింగ్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రభాస్‌ 39వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Prabhas Movie Shooting In Italy