Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ భాషలో అయినా హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శిస్తే తప్ప కెరీర్ కొనసాగడం కష్టం. అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే అందాల ఆరబోత చేయకున్నా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఆ కొద్ది మంది కూడా కొంత కాలం వరకే ఉండి కనుమరుగవుతున్నారు. అయితే గ్లామర్‌గా నటించేందుకు ఓకే చెప్పే వారికి మాత్రం నాలుగు సినిమాల్లో అవకాశం దక్కుతుంది. సినిమాలు సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కూడా వారికి ఆఫర్లు అనేవి వస్తూనే ఉన్నాయి. తెలుగులో నిత్యామీనన్ తన నటన ప్రతిభతో మాత్రమే కెరీర్లో నెట్టుకు వస్తాను అంటూ ముందు నుండి చెబుతూ వస్తుంది.
గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరం ఉంటూ వస్తున్న నిత్యా మీనన్ ప్రస్తుతం ఇండస్ట్రీకి మెల్ల మెల్లగా దూరం అవుతుంది. ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు నిత్యామీనన్ దారిలోనే సాయి పల్లవి నడుస్తానంటోంది. తాను ఎట్టిపరిస్థితుల్లో కూడా స్కిన్ షోకు ఒప్పుకోను అని, తన నటనపై నమ్మకం పెట్టి తన వద్దకు వచ్చే దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది. స్కిన్ షో చేసేందుకు ఒప్పుకుంటే మొత్తం అవే పాత్రలు వస్తాయని, నటనకు ఆస్కారం ఉండే పాత్రలు రావని తన అభిప్రాయం అంటూ ముద్దుగుమ్మ సాయి పల్లవి చెబుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఒకటి తమిళంలో రెండు చిత్రాలను చేస్తోంది. ఆ సినిమాల్లో కూడా పద్దతిగా కనిపించబోతుంది. మరీ పద్దతిగా ఉండాలంటే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం. మరి ఈ అమ్మడు ఇలా ఎంత కాలం మడి కట్టుకుని కూర్చుంటుందో చూడాలి.