నాగచైతన్య, అను ఎమాన్యూల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’. వరుసగా విజయాలు దక్కించుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్లో రూపొందుతున్న ఈ చిత్రంను ఆగస్టు చివర్లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తి కాబోతుంది. ఈ సమయంలోనే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేయడం జరిగింది. ఫస్ట్‌లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించడం జరుగుతుంది.
మూడు నాలుగు రోజు క్రితం శైలజ రెడ్డి అల్లుడు ఫస్ట్‌లుక్ అంటూ ఒక పోస్టర్ లీక్ అయ్యింది. అది లీకా లేకుంటే కావాలని విడుదల చేశారా లేదంటే మరేదైనా వ్యూహమా అనే విషయం పక్కన పెడితే అందులో కేవలం చైతూ మాత్రమే ఉండి సాదా సీదాగా అనిపించింది. కాని తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ వావ్ అనిపించేలా ఉంది. సినిమా ఏంటో ఈ పోస్టర్‌తోనే దర్శకుడు మారుతి చెప్పేశాడు. పొగరుబోతు అత్తకు గడుసు అల్లుడు, సొగసరి కూతురు అన్నట్లుగా పోస్టర్లో చూపించేశాడు. పోస్టర్‌తోనే సినిమా సగం కథను చెప్పేసిన దర్శకుడు ఈ చిత్రంను తనదైన మార్క్ ఎంటర్టైనర్తో తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నాడు. మారుతి ప్రతి సినిమాలో కూడా హీరోకు ఏదో సమస్య ఉంటుంది. ఈ చిత్రంలో ఆ సమస్య ఏంటీ అనే విషయాన్ని సినిమా విడుదలయ్యే వరకు రివీల్ చేయడం లేదట. ఆగస్టు 31న చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల చివర్లో ఆడియోకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చైతూకు ఈ చిత్రం విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు.