యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా ‘సలార్’ కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు , ఇండియా మొత్తం ఎదురు చూస్తూ ఉంది .
ఎప్పుడో సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , మరింత క్వాలిటీ ఔట్పుట్ కోసం పలు సన్నివేశాలను రీ షూట్ చేసి, కొత్తగా ఒక ఐటెం సాంగ్ ని జతపర్చి రీసెంట్ గానే షూటింగ్ కి గుమ్మడి కాయ కూడా కొట్టేసారు. డిసెంబర్ 22 వ తారీఖున విడుదల చెయ్యడానికి కావాల్సిన అన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ప్రభాస్ కూడా వచ్చే నెల మొదటి వారం నుండి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ లో పాల్గొనబోతున్నారూ . అలాగే డిసెంబర్ 1 వ తేదీన ‘సలార్’ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు.
ఇది వరకే టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది .
కానీ డిసెంబర్ 1 వ తేదీన విడుదల చెయ్యబొయ్యే ట్రైలర్ తో ఫ్యాన్స్ కి పునాకలు రావడం తధ్యమని అంటున్నారు మేకర్స్. ఆ రేంజ్ లో ట్రైలర్ షాట్స్ ఉంటాయట. ప్రభాస్ ని ఊర మాస్ యాంగిల్ లో చూసి అభిమానులకు చాలా రోజులే అయ్యింది. ఈ కటౌట్ ని సరిగా వాడుకోవట్లేదే అనే నిరాశ అభిమానుల్లో ఉండేది.
ఈ ‘సలార్( Salaar )’ సినిమా తో అటువంటి కంప్లైంట్స్ కి ప్రభాస్ చెక్ పెట్టబోతున్నాడని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికా లో నిన్ననే ప్రారంభించారు. ఆ దేశం లో ఉన్నటువంటి ప్రధాన థియేటర్స్ అన్నిటి లో దాదాపుగా అడ్వాన్స్ బుకింగ్స్( Advance bookings ) ప్రారంభించగా కేవలం అరగంట వ్యవధి లోనే 10 వేల టికెట్స్ అమ్ముడుపోయాయని, దాదాపుగా మూడు లక్షల రూపాయిల గ్రాస్ నెల రోజుల ముందే వచ్చేసిందని అంటూ ఉన్నారు . కేవలం ప్రీమియర్ షోస్ నుండే రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను తియ్యాలని మేకర్స్ ఎదురు చూస్తున్నారు .
గతం లో #RRR సినిమా కూడా ఇలాగే అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం పూర్తి అయినా తర్వాత వాయిదా వేశారు. ఇప్పుడు సలార్ విషయం లో కూడా అదే జరిగింది. అంటే ఫైనల్ కలెక్షన్స్ లో కూడా ‘సలార్’ సినిమా #RRR రేంజ్ లో ప్రభంజనం సృష్టించబోతోందా?, ఒకవేళ అదే మ్యాజిక్ కనుక రిపీట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ సునామి ఒక రేంజ్ లో ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కూడా లేకపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.