బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకోన్నది. సల్మాన్‌కు అత్యంత ఇష్టమైన, ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ ఆకస్మిక మృతి చెందండంతో కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నది. తన మేనల్లుడి మృతిని సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. అలాగే అబ్దుల్లా ఖాన్ మృతిపై వస్తున్న రూమర్లను కూడా కుటుంబ సబ్యులు ఖండించారు. అబ్దుల్లా మృతి గురించి వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా అబ్దుల్లా డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని ధిరూభాయ్ కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్లో చేర్పించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో స్వయంగా సల్మాన్ ఖాన్ తన మేనల్లుడిని మెరుగైన చికిత్స కోసం ముంబై బాంద్రాలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు.
అయితే లీలావతి హాస్పిటల్లో అబ్దులా ఆరోగ్యం కోసం వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. అనారోగ్యం కారణంగా అబ్దులా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబానికి అత్యంత ఇష్టమైన వ్యక్తి దూరం కావడంతో సల్మాన్ కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.