బాలీవుడ్ ఖాన్ త్రయంలో ముఖ్యులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్. వీరిద్దరు ఒకప్పుడు శత్రవులుగా ఉన్నప్పటికి, ప్రస్తుతం మంచి మిత్రులుగా మారారు. ఒకరి సినిమాలలో ఒకరు నటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమ బాధ్యతలని కూడా మోస్తున్నారు . అయితే తాజాగా షారూఖ్ ఖాన్ రియల్ లైఫ్‌లో రియల్ హీరోగా మారి ఓ నిండుజీవితాన్ని కాపాడాడు. దీనిపై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా ఓ వీడియో షేర్ చేస్తూ అతనిని రియల్ హీరో అనేశారు.
దాదాపు మూడేళ్ల తర్వాత అమితాబ్ ముంబయిలోని తన నివాసంలో ఇటీవల దీపావళి వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌కి చెందిన ఎందరో అతిరథమహారథులు వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్ వద్ద మేనేజర్‌గా పనిచేసిన అర్చనా సదానంద్ అనే యువతి కూడా వేడుకకు వెళ్లింది. అయితే ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుని మంటలు అంటున్నాయి. అక్కడే ఉన్న షారుక్ ఖాన్ రిస్క్ చేసి మరి మంటలు అదుపు చేశారు. అర్చన చేతికి కాలికి 15 శాతం గాయాలు కాగా, షారూఖ్ కూడా కొద్ది గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది.
షారూఖ్ సాహసం గురించి తెలుసుకున్న సల్మాన్ ‘హ్యాపీ న్యూఇయర్’ సినిమాలోని ఓ క్లిప్ షేర్ చేసాడు. ఇందులో షారూఖ్ నటించగా, సల్మాన్ వాయిస్ ఓవర్ అందించాడు. సందర్భానుసారం అదే క్లిప్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు సల్మాన్. ఒక్కసారిగా ఆ వీడియోకి లైకుల వర్షం కురిసింది. ‘మంటల్లో దూకి ఎవరినైతే రక్షిస్తాడో అతడినే హీరో అంటాడు అని సల్మాన్ ఆ వీడియోలో చెబుతుండడం విశేషం.