Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంతల వివాహం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 6న వీరి వివాహం వైభవంగా జరుగబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇప్పటికే అయ్యింది. పెళ్లికి సిద్దం అవుతున్న వీరిద్దరు త్వరలోనే కలిసి ఒక సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఆ సినిమా తెలుగులో కాకుండా తమిళంలో ఉండబోతుంది. తమిళంకు చెందిన సమంత, అక్కడ హీరోయిన్గా మంచి గుర్తింపునే దక్కించుకుంది. అందుకే తనతో చైతూను తమిళంలోకి తీసుకు వెళ్లాలని ఈ అమ్మడు నిర్ణయించుకుంది. తమిళంలో ఒక ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో చైతూ హీరోగా పరిచయం కాబోతున్నాడు.
పెళ్లి అయిన తర్వాత రెండు లేదా మూడు నెలల గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ సమంత వచ్చే ఏడాది ఆరంభంలో చైతూతో కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తమిళంలో నాగచైతన్యను హీరోగా పరిచయం చేయడం ద్వారా ఆయన స్థాయి మరింత పెంచాలని సమంత భావిస్తుంది. సమంతకు ఉన్న క్రేజ్‌తో చైతూకు తప్పకుండా మంచి ఎంట్రీ అక్కడ దక్కుతుంది. అందుకే పలువురు ఫిల్మ్ మేకర్స్ కూడా చైతూతో సినిమాను తమిళంలో చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వీరు చేసే ప్రాజెక్ట్ మాత్రం ఫైనల్ కాలేదు. వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో వీరి కాంబో మూవీ తమిళంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అదే సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.