సమంత కొత్త బ్యానర్‌ ఎస్‌ఎన్‌ పిక్చర్స్‌?

samantha-akkineni-new-banner-name-sn

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి, అదే పేరు మీద కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆయన వారసుడు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌పై వరుసగా చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత నాగార్జున సోదరి ఒక బ్యానర్‌ను స్టార్ట్‌ చేసింది. తాజాగా మనం ఎంటర్‌ప్రైజెస్‌ అంటూ నాగార్జున కొత్త బ్యానర్‌ను ప్రారంభించాడు. అక్కినేని వారికి సంబంధించి ప్రస్తుతం పలు బ్యానర్‌లు ఉండగా మరో కొత్త బ్యానర్‌ ఆ ఫ్యామిలీ నుండి రాబోతుంది. ఆ బ్యానర్‌ను అక్కినేని సమంత ప్రారంభించబోతుంది. చాలా కాలంగా కన్నడంలో సక్సెస్‌ అయిన యూటర్న్‌ అనే చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు సమంత ఆసక్తిగా ఉంది. ఇప్పుడు సమంత నిర్మాణం చేసేందుకు సిద్దం అయ్యింది.

భర్త నాగచైతన్య మరియు మామ నాగార్జునల మద్దతుతో ఒక కొత్త బ్యానర్‌ను ప్రారంభించి తెలుగులో యూ టర్న్‌ను రీమేక్‌ చేయాలని నిర్ణయించుకుంది. సమంత తన బ్యానర్‌కు ఎస్‌.ఎన్‌ అనే పేరును కూడా ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతుంది. సమంత, నాగచైతన్య పేర్లకు షార్ట్‌ ఫాంగా ఎస్‌.ఎన్‌ అంటూ తన బ్యానర్‌ పేరును పెట్టాలని సమంత భావిస్తుంది. తన మొదటి సినిమాను పది కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలని కూడా సమంత భావిస్తుంది. నిర్మిస్తూ నటించబోతుంది. నాగచైతన్య నిర్మాణ పనుల్లో ఆమెకు హెల్ప్‌గా నిలువనున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి రాబోతున్న ఎస్‌ఎన్‌ బ్యానర్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.