నా హద్దులు నాకున్నాయి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత తన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా బీచ్‌లో బికినీలో సేదతీరుతున్న ఒక ఫొటోను సమంత పోస్ట్‌ చేయడం జరిగింది. ఆ ఫొటోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక తెలుగింటి అమ్మాయి ఇలాగేనా ఉండేది అంటూ సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత ఇలాంటి కాస్ట్యూమ్స్‌ ధరించడంను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే సమంతను ట్విట్టర్‌లో ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. తనపై వస్తున్న ట్రోల్‌కు సమంత గట్టి సమాధానం చెప్పి అందరి నోళ్లు మూయించింది.

samanth bikini

సమంత ట్విట్టర్‌ ద్వారా.. నా హద్దులు, నా రూల్స్‌ నాకు ఉన్నాయి, మీ రూల్స్‌ ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. పెళ్లి అయిన ఆడవారు పట్టు చీరలు కట్టుకోవాలని, పద్దతిగా ఉండాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా అంటూ ప్రశ్నించింది. పెళ్లికి ముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలాగే ఉంటాను అంటూ సమంత చెబుతుంది. తన భర్తకు లేని అభ్యంతరం వీరికి ఏంటని సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. రంగస్థలం చిత్రంలో సమంత చాలా కొత్తగా విభిన్నంగా కనిపించబోతుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ ఆ విషయాన్ని చెబుతుంది. మార్చిలో రంగస్థలం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.