స‌మంత డ్రీమ్ డైరెక్ట‌ర్స్ ఎవ‌రో తెలుసా ?

samantha dream directors

అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌ల‌లో ఒక‌రు. ఆమె న‌టించిన ఓ బేబి చిత్రం నేడు భారీ సంఖ్య‌లో విడుద‌లైంది. ఎమోష‌న‌ల్‌తో పాటు ప‌లు కామెడీ సన్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. కొరియ‌న్ డ్రామా మిస్‌గ్రానీ రీమేక్‌గా నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని స‌మంత భారీగా ప్ర‌మోట్ చేసుకుంది. ఓ ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో స‌మంత త‌నకి ఇద్ద‌రు డైరెక్ట‌ర్స్‌తో ప‌ని చేయాల‌నే ఆస‌క్తి చాలా ఉంద‌ని పేర్కొంది. అందులో ఒక‌రు యూత్‌ఫుల్ చిత్రాల‌ని అద్భుతంగా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. మ‌రొక‌రు ఆణిముత్యాల్లాంటి సినిమాల‌ని తెర‌కెక్కించే మ‌ణిర‌త్నం. వీరిద్దరి ద‌ర్శ‌క‌త్వంలో ఎప్ప‌టికైన ఓ సినిమా చేయాల‌నుంద‌ని స‌మంత పేర్కొన‌డం విశేషం. అయితే ప్ర‌స్తుతం స‌మంత భ‌ర్త చైతూ .. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా, ఇందులో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుందా అనేది చూడాలి.