స‌మంత, చైతూ వివాహ ముహూర్తం రాత్రి 11.52నిమిషాలకు

Samantha and nagachaitanya wedding time 11.52 pm

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ మోస్డ్ హ్యాపెనింగ్ వెడ్డింగ్ కు ఇంకా కొన్ని గంట‌లే గడువుంది. రేపు రాత్రి నాగ‌చైత‌న్య‌, స‌మంత మూడుముళ్ల బంధంతో ఒక్క‌టి కానున్నారు. ఇప్ప‌టికే గోవాలో పెళ్లి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అక్కినేని, ద‌గ్గుబాటి కుటుంబాలు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో గోవా వెళ్లాయి. చైత‌న్య‌, స‌మంత‌, నాగార్జున ఇప్ప‌టికే అక్క‌డ‌కు చేరుకున్నారు. పెళ్లికి హాజ‌ర‌య్యే అతిథులకు గోవాలోని వెగ్టార్ బీచ్ లో ఉన్న డ‌బ్ల్యూ హోట‌ల్ లో విడిది ఏర్పాటుచేశారు. రేపు మ‌ధ్యాహ్నం నుంచి వివాహ వేడుక ప్రారంభ‌మ‌వుతుంది. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు మెహిందీ వేడుక నిర్వ‌హిస్తారు. రాత్రి 8.30కు డిన్న‌ర్ ఏర్పాటుచేశారు. ఆ త‌ర్వాత అర్ధ‌రాత్రి 11 గంట‌ల 52 నిమిషాల‌కు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం నాగ‌చైత‌న్య స‌మంత మెడ‌లో మూడుముళ్లు వేస్తాడు. త‌ర్వాతి రోజు క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది.

శ‌నివారం మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల‌కు బ్రంచ్ తో రెండో రోజు వివాహ వేడుక‌లు మొద‌ల‌వుతాయి. బ్రేక్ ఫాస్ట్ , లంచ్ పూర్త‌యిన త‌ర్వాత క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తిలో నాగ‌చైత‌న్య‌, స‌మంత ఉంగ‌రాలు మార్చుకుంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 వ‌ర‌కు ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. త‌ర్వాత అర్ధ‌రాత్రి వ‌ర‌కు డిన్న‌ర్ తో పాటు పార్టీ ఉంటుంది. మిడ్ నైట్ వ‌ర‌కు జ‌రిగే పార్టీతో నాగ‌చైత‌న్య‌, స‌మంత రెండు రోజుల పెళ్లివేడుక‌లు ముగుస్తాయి. ఎనిమిదో తేదీ సాయంత్రానికి బంధువులంతా తిరిగి హైద‌రాబాద్ చేరుకుంటారు. అటు పెళ్లికూతురు స‌మంత సాధారాణ అమ్మాయిల్లానే త‌న పెళ్లిపై ఉద్వేగంగా ఉంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా చెప్పింది. పెళ్ల‌య్యాక త‌న జీవితంలో పెద్ద మార్పులొస్తాయ‌ని అనుకోవ‌డం లేద‌ని, త‌న గురించి అన్నీ తెలిసిన స్నేహితుడే జీవిత భాగ‌స్వామి కావ‌డంతో భ‌విష్య‌త్తులో కూడా జీవితం ఇంతే ఆనందంగా సాగుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తంచేసింది