‘రంగస్థలం’ ఐటెం ఖరీదు ఎంతో తెలిస్తే షాక్‌

pooja hegde remuneration for Item Song in Rangasthalam 1985

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుకుమార్‌ ప్రతి సినిమాలో కూడా ఐటెం సాంగ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఐటెం సాంగ్‌లు సూపర్‌ హిట్‌ అయ్యాయి. మరోసారి ఆ క్రెడిట్‌ను కంటిన్యూ చేసేందుకు సుకుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘రంగస్థలం’ చిత్రంలో ఐటెం సాంగ్‌ను ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్‌ హీరోయిన్‌తో ఐటెం సాంగ్‌ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే పూజా హెగ్డేను సంప్రదించడం ఆమె ఓకే చెప్పడం జరిగిపోయింది.

తాజాగా పూజా హెగ్డే ‘రంగస్థలం’ ఐటెం సాంగ్‌ గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చేయబోతున్న ఐటెం సాంగ్‌ సినిమాకు చాలా కీలకం అని, చాలా భారీగా ఉండబోతున్నట్లుగా దర్శకుడు చెప్పాడంటూ పేర్కొంది. ఇక ఈ ఐటెం సాంగ్‌ కోసం ఈ అమ్మడు ఏకంగా 80 లక్షల పారితోషికం అందుకోబోతుంది. కేవలం వారం రోజుల్లోనే ఈ ఐటెం సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారు. వారం రోజుల కాల్షీట్లకు ఏకంగా 80 లక్షల పారితోషికాన్ని పూజా హెగ్డే అందుకోబోతుంది. ఇక పాట చిత్రీకరణ కూడా భారీగా ఉండబోతుంది.

దాదాపు 250 మంది డాన్సర్స్‌ మరియు 400 మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఈ పాటలో ఉంటారని తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ మరియు సమంతలు కూడా ఈ పాటలో కనిపించనున్నారట. మొత్తంగా రంగస్థలంలోని ఐటెం సాంగ్‌ ఖరీదు 4 కోట్లకు పైగానే ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే వేసిన పల్లెటూరు సెట్‌ను మరింతగా తీర్చిదిద్ది అందులో పాటను చిత్రీకరించబోతున్నారు. విభిన్నంగా ఈ ఐటెం సాంగ్‌ ఉంటుందని దర్శకుడు సుకుమార్‌ చెబుతున్నాడు. ఐటెం సాంగ్‌ చిత్రీకరణ త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా సుకుమార్‌ అండ్‌ టీం ప్రకటించింది.