అవన్నీ పుకార్లే అని తేలిపోయింది

Samantha doesn't Produce U-Turn movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన ‘యూటర్న్‌’ చిత్రాన్ని సమంత ఎంతో ఇష్టపడి రీమేక్‌ రైట్స్‌ తీసుకుందని, ఆ సినిమాను స్వయంగా తానే నిర్మించాలని భావిస్తుంది అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సమంత హీరోయిన్‌గా నటించడంతో పాటు మామ నాగార్జున, భర్త నాగచైతన్యల సహకారంతో సినిమాను ఆమె సొంతంగా నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను సమంత నిర్మించడం లేదని తేలిపోయింది. సమంత రీమేక్‌ రైట్స్‌ కొనుగోలు చేసింది అనే విషయంలో కూడా వాస్తవం లేదు. 

తాజాగా ‘యూటర్న్‌’ చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సమంత హీరోయిన్‌గా తెరకెక్కబోతున్న ఆ చిత్రం లో బడ్జెట్‌లో నిర్మాణం జరుగబోతుంది. ఇక ఈ చిత్రం కోసం సమంత చాలా తక్కువ పారితోషికంను తీసుకుంటుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇటీవల కాలంలో సమంత నటించిన చిత్రాల్లో అతి తక్కువ బడ్జెట్‌ చిత్రం ఇదే అని, కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మనసుకు నచ్చిన చిత్రం అవ్వడంతో సమంత తక్కువ బడ్జెట్‌ అయినా, తక్కువ పారితోషికం అయినా కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.