సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్ సినిమా కూడా చేస్తోంది. తాజాగా తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన మరోసారి నటించనుందట. ఇప్పటికే వీరిద్దరు మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
శివ నిర్శాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముందుగా విజయ్‌కి జోడీగా కియారాను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ ఫైనల్‌గా ఆ ప్రాజెక్ట్ సమంత వద్దకి వచ్చిందట. దీంతో సామ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.