నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలు సైన్ చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సామ్ ప్రస్తుతం హిందీలో ఓ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
‘వెబ్‌సిరీస్ చేయాలన్న ఆలోచన అప్పటి వరకు లేదు. కానీ రాజ్,డీకే నా ఆలోచనల్లో మార్పు తెచ్చారు. కుదరదు అని చెప్పకూడదని నిర్ణయించుకున్నా. రాజీ పాత్రకు నేను ఊహించినదానికంటే ఎక్కవే అభినందనలు దక్కాయి. ఈ సిరీస్‌తో కొత్త సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం ఏర్పడింది’ అని పేర్కొంది.
ఇక గ్లామర్ రోల్స్‌పై స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి అలసిపోయాను. ఇక మీదట రోల్స్ చేయడానికి నేను సమర్థురాలిని కాదని నమ్ముతున్నా. నటిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.బాలీవుడ్‌కు ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నారు అన్నదానిపై మాట్లాడుతూ.. ‘దక్షిణాదిలో మంచి స్థానం దక్కడమే దీనికి కారణమని, గత రెండేళ్లలో పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి’ అనిపేర్కొంది.