Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమంత గత కొన్నాళ్లుగా ‘యూటర్న్’ చేయాలని ఆశపడుతున్న విషయం తెల్సిందే. కన్నడంలో సక్సెస్ అయిన యూటర్న్ రీమేక్ రైట్స్‌ను తన సన్నిహితులతో కొనిపించిన సమంత త్వరలోనే ఆ చిత్రాన్ని మొదలు పెట్టేందుకు సిద్దం అవుతుంది. నిన్న మొన్నటి వరకు సమంత స్వయంగా యూటర్న్ చిత్రాన్ని నిర్మించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యూటర్న్ చిత్రాన్ని సమంత కాకుండా మరో నిర్మాతకు ఆ బాధ్యత అప్పగించినట్లుగా తెలుస్తోంది. సమంతతో ఇటీవల ‘రాజుగారి గది 2’ చిత్రాన్ని తెరకెక్కించిన ఓంకార్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించేందుకు ముందుకు వచ్చాడు.
హర్రర్ చిత్రాల దర్శకుడిగా మంచి క్రేజ్‌ను దక్కించుకున్న ఓంకార్‌తో ఈ చిత్రాన్ని చేయాలని సమంత ఫిక్స్ అయ్యింది. త్వరలోనే ఆ యూటర్న్ చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది. సమంత కోరిక మేరకు యూటర్న్ రీమేక్ కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్న దర్శకుడు ఓంకార్ ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద తేల్చి చెప్పాడు. సమంత ఎంతో ఇష్టపడి రీమేక్ చేయాలనుకుంటున్న యూటర్న్ సమ్మర్లో సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం సమంత చేస్తున్న చిత్రాలు పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత యూటర్న్ మొదలు పెట్టాలని ఇన్నాళ్లు ఎదురు చూసింది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఓంకార్ తీసుకోబోతున్న యూటర్న్ సమంత కెరీర్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.