స‌మంత‌తో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం చేయ‌నున్న‌ లేడి డైరెక్ట‌ర్

samantha with director nandini reddy

వ‌రుస సక్సెస్‌ల‌తో మంచి జోరు మీదున్న స‌మంత రీసెంట్‌గా ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజ‌యం సాధించింది. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం కొరియ‌న్ మూవీ మిస్‌గ్రానీ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. క‌ట్ చేస్తే నందిని రెడ్డి- స‌మంత కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుంద‌ని అంటున్నారు. ఓ బేబి చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే నందిని .. స‌మంత‌కి ఓ క‌థ వినిపించార‌ట‌. క‌థ న‌చ్చిన సామ్ ఆ ప్రాజెక్ట్‌ని త‌ప్ప‌కుండా చేద్దామ‌ని అన్నార‌ట‌. నందిని- స‌మంత కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఓ బేబి చిత్రం భారీ విజ‌యం సాధించింది కాబ‌ట్టి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రానున్న త‌దుపరి చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. అంతేకాదు మంచి బిజినెస్ కూడా జ‌రుగుతుంది. కాగా, సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘ఆహా కళ్యాణం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.