Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Sampath Nandi opens up on Ram Charan’s Chota Mestri movie
రామ్ చరణ్‌తో ‘రచ్చ’ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంపత్ నంది ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే టైం బాగాలేదో మరేమైందో కాని సంపత్ నందికి పవన్ సినిమా ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. పవన్ సినిమా నుండి తప్పుకున్న వెంటనే పవన్ కళ్యాణ్‌తో ‘బెంగాల్ టైగర్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమా రవితేజ కెరీర్లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు ‘గౌతమ్ నంద’ అనే చిత్రంతో సంపత్ నంది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘గౌతమ్‌నంద’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే సంపత్‌నంది మీడియాతో మాట్లాడుతూ ‘చోటామేస్త్రీ’ టాపిక్‌పై స్పందించాడు.
‘రచ్చ’ చేసిన వెంటనే రామ్ చరణ్‌తో ‘చోటామేస్త్రీ’ అనే చిత్రాన్ని చేయాలని సంపత్ నంది భావించాడు. అయితే సంపత్ నందికి పవన్ నుండి పిలుపు రావడంతో చరణ్‌తో సినిమాను వాయిదా వేసుకున్నాడు. ‘రచ్చ’ సమయంలోనే చరణ్‌తో ‘చోటామేస్త్రీ’ స్క్రిప్ట్ చర్చించాడు. ఒక స్టోరీ లైన్‌ను చరణ్‌కు చెప్పడం ఒప్పించడం జరిగింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకున్నా స్టోరీ లైన్ మాత్రం సిద్దంగా ఉంది. తాజాగా చరణ్‌తో ఎప్పటికైనా ఆ సినిమాను చేయాలని తన కోరిక అంటూ సంపత్ నంది చెప్పుకొచ్చాడు. త్వరలో విడుదల కాబోతున్న గోపీచంద్ ‘గౌతమ్‌నంద’ చిత్రం సూపర్ హిట్ అయితే రామ్ చరణ్ తప్పకుండా పిలిచి మరీ మరోసారి రచ్చ చేద్దాం అంటాడేమో. చోటామేస్త్రీ భవిష్యత్తు గౌతమ్‌నంద చేతుల్లో ఉందన్నమాట.
మరిన్ని వార్తాలు :