ఏపీలో ఇసుక కొరతను సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరదల వల్ల రీచ్‌లు మునిగిపోయి ఇసుక డిమాండ్‌ను చేరలేకపోయామన్నారు. వారం రోజుల్లో ఈ పరిస్థితి మెరుగుపడిందన్నారు. 1.20లక్షలకు రోజువారి ఇసుక లభ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీసుకొనేవరకు అధికారులెవరూ సెలువులు తీసుకోవద్దన్నారు. నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎవరైన ఎక్కువ రేటుకు ఇసుక అమ్మితే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రేపు కేబినెట్‌లో కూడా ఆమోదం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నీచరాజకీయాలకు, శవరాజకీయాలకు మరో పేరు అని ప్రజలు తిట్టిపోస్తున్నారు.మొన్నటికి మొన్న సొంత పుత్రుడు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ తో నాలుగు గంటలపాటు దీక్ష చేయించాడు. నిన్న దత్తపుత్రుడు, జనసేన పార్టీ అధినేత పవన్ నాయుడుతో భవన్ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా విశాఖలో లాంగ్ మార్చ్ చేయించారు. ఈరోజు తానే విజయవాడలో ధర్నా చౌక్ లో 12 గంటల పాటు దీక్ష చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్నాడు.
ఇసుకను ఉచితంగా పంపిణీ ప్రభుత్వం నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల భృతి ఆత్మహత్య చేసుకున్న భవన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలనే నినాదంతో చంద్రబాబు దీక్ష చేపట్టారు. అయితే గతంలో భవన కార్మికుల ప్రాణం తీసింది చంద్రబాబు అని, వారికీ ఎంతమాత్రం మీరు న్యాయం చేశారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఇసుకపై ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి. ఒకానొకదశలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్నందుకు తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే, టీడీపీ నేతలు దాడి కూడా చేశారు. ఇన్ని చేసిన టీడీపీనే ఇప్పుడు దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది అని ట్విట్టర్ వేధికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.