పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సానియా

ప్రముఖ టెన్నిస్‌ క్రీడా కారిణీ సానియా మీర్జా తన కుమారుడి పుట్టినరోజు సందర్బంగా ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన కుమారుడు ఇజ్‌హాన్‌ మొదటి పుట్టిన రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమారుని ఫోటోను జతచేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సానియా - Telugu Bullet

“ఈ ప్రపంచానికి నువ్వు వచ్చి, నా ప్రపంచంగా మారి సరిగ్గా నేటితో ఏడాది పూర్తయింది” అని కామెంట్ ద్వారా తెలిపింది. చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెంట నేను ఉంటాను, పుట్టినప్పుడు నువ్వు ఎలా చిరునవ్వు చిందించావో అలాగే నువ్వు ఉండే ప్రతి చోటా నవ్వులు పంచుతావని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నీ వెన్నంటే చివరి శ్వాస ఉన్నంత వరకూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. చిన్ని తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అల్లాహ్ దయచేసే ప్రతిపనిలో నీకు ఉంటుందని కోరుకుంటున్నాను. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఇజాన్‌ అని పోస్ట్‌ చేశారు. సానియా చేసిన పోస్టుకు బర్త్‌ డే విషెస్‌ పలువురు బాలీవుడ్‌ తారలు ఇజ్‌హాన్‌కు చెప్పారు.