విజయవాడ దుర్గ గుడిలో ఆషాఢమాసం సందర్భంగా కొంతమంది భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించగా వాటిలో రూ.18వేల విలువ చేసే చీర మాయమయ్యింది. ఈ వ్యవహారంంలో పాలకమండలి సభ్యురాలు సూర్యలతపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె మీద ఆలయ చైర్మన్ చర్యలు తీసుకున్నారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు సూర్యలతకు మెమో జారీ చేశారు. ఈ చీర గొడవ తేలే వరకు ఆమెని గుడివైపు రావొద్దని ఆదేశించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంతో కేవలం 24 గంటల్లో విచారణ జరిపి నివేదికను సిద్ధం చేశారు. ఆలయ ఈవో పద్మ ఓ నివేదికను సిద్ధం చేసి ఆ నివేదికని ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమయ్యారట.
అందులో ప్రత్యక్ష సాక్షల అభిప్రాయాలతో పాటూ సీసీ ఫుటేజ్‌ను కూడా పొందుపరిచారట. అందులో సూర్యకుమారి చీర తీసిందని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చీర పంచాయితీ మరింత ముదిరితే ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే సూర్యలత ఈ మెమోను తీసుకునేందుకు నిరాకరించి పాలకమండల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారట. ఛైర్మన్ మాత్రం ఈ వ్యవహారం తేలిన తర్వాత చూద్దామని చెప్పారట. దీంతో ఆమే చీర తీసినట్టు భావిస్తున్నారు.