బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సరిలేరు నీకెవ్వరు

బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సరిలేరు నీకెవ్వరు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మికా మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదిరిపోయే కామెడీ, మంచి స్టోరీ లైన్ ఉన్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతూ మంచి టాక్‌ని సంపాదించుకుంది.

అయితే ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని నింపేందుకు చిత్ర బృందం మరికొన్ని సన్నివేశాలను యాడ్ చేసేందుకు సిద్దమయ్యింది. అయితే ఆ సన్నివేషాలను జనవరి 25 మార్నింగ్ షో నుంచి అన్ని థియేటర్లలో ఈ సీన్లు యాడ్ అవ్వబోతున్నాయి. మహేశ్ బాబు, రావు రమేశ్ ఫ్యామిలీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆ సన్నివేశాలకి కొనసాగింపుగా మరో సన్నివేశాన్ని జతపరచబోతున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు.