‘స‌రిపోదా శ‌నివారం’ ఫ‌స్ట్ సింగిల్ లేటెస్ట్ అప్డేట్.. ఎప్పుడంటే?

'Saripoda Shanivaram' first single latest update.. When?
'Saripoda Shanivaram' first single latest update.. When?

నేచుర‌ల్ స్టార్ నాని న‌ట‌స్తున్న తాజా మూవీ ‘స‌రిపోదా శ‌నివారం’ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీ ను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో ఈ అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

అయితే, తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ఈ మూవీ లోని ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కి సంబంధించి నేడు సాయంత్రం 4.05 గంట‌ల‌కి అప్డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ కి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీ లోని పాట‌లు ఎలా ఉంటాయా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

'Saripoda Shanivaram' first single latest update.. When?
‘Saripoda Shanivaram’ first single latest update.. When?

ఇక ఈ మూవీ లో నాని ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ ని రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ లో వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్ ఎస్.జె.సూర్య విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్ర‌తిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తోంది.