సర్కార్ తరువాత అట్లీ సినిమానే పట్టాల పైకి…?

sarker-movie

తమిళ హీరో విజయ్ కి, అతని సినిమాలని ఆరాధించే తెలుగు అభిమానులకి ఎప్పటినుండో అర్ధం కానీ విషయం ఏమిటంటే తెలుగులో విజయ్ కి మార్కెట్ ఇంకా ఎందుకు కలగలేదా అని. అంతే కదా, మొన్నకాక మొన్న వచ్చిన కార్తీ, నిన్న కాక నిన్న వచ్చిన మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ లే తెలుగు యువహీరోలతో సరిసాటి అభిమానం తో పాటు, మార్కెట్ను సంపాదించుకున్నారు. ఇదివరకంటే విజయ్ మరియు పవన్ కళ్యాణ్ లు ఒకరి సినిమాలు మరొకరు వారి వారి భాషల్లో రీమేక్ లు చేసుకునేవాళ్ళు. కానీ, ఇప్పుడు కథ పూర్తిగా మారింది.

sarkar

మురుగదాస్ తో జతకట్టి వరుసగా తుపాకి , కత్తి వంటి భారీ విజయాలు తమిళంతో పాటు, తెలుగులో కూడా నమోదుచేసి, ఇప్పుడు విజయ్ మరోసారి సర్కార్ అంటూ మరోసారి తమిళంతో పాటే, తెలుగు రిలీజ్ కి రెడీ అయిపోయాడు దళపతిగా అభిమానుల చేత పిలవబడే విజయ్. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా టీజర్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా నవంబర్ 7 న ఫిక్స్ చేశారు. సర్కార్ తరువాత మల్లి దళపతి విజయ్ ఏ సినిమా మొదలెడుతారా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికారికంగా ప్రకటన చేయకపోయినా, తమిళనాట వినపడుతున్న విషయం ఏమిటంటే దళపతి విజయ్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ అట్లీ తోనే అని. డైరెక్టర్ అట్లీ ఇప్పటికే అదిరింది (తమిళంలో మెర్సల్) అనే సూపర్ డూపర్ హిట్ మూవీని విజయ్ ఖాతాలోకి చేరవేశా డు. సో…అట్లీతోనే విజయ్ నెక్స్ట్ మూవీ అనగానే విజయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అట్లీ కూడా ఆదరింది లాగే మరో సందేశాత్మక సినిమా కి స్క్రిప్టుని సిద్ధం చేస్తున్నాడు అని ఇన్సైడ్ టాక్. అదిరిందితో మార్కెట్ చాలా పెంచేసుకున్న విజయ్ సినిమాలు ఇకనుండి తమిళంతో పాటుగానే తెలుగులో కూడా ఒకేసారి విడుదల అవుతాయి.

sarkar-vijay-movie