మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటర్నెట్ వచ్చిన తరువాత వ్యక్తిగత సమాచారం చోరీ అనేది చాలా ఈజీగా జరిగిపోతోంది. మీ మొబైల్ ఫోన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న హ్యాక్ అవడం ఖాయమని ఎడ్వర్డ్ స్నోడెన్ చెబుతున్నారు. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో మీ మొబైల్ హ్యాక్ అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కింది విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని లేకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.

  • ఆండ్రాయిడ్ ఓ ఎస్ వాడటం కన్నా గ్రాఫేన్ ఓ ఎస్ వాడటం అత్యంత సురక్షితమైనదని ఆండ్రాయిడ్ యాప్ లో మంచి రక్షణ కల ఓపెన్ సోర్స్ యాప్ అని చెబుతున్నారు.
  • మైక్రోఫోన్స్, బ్లూటూత్ అనవసరమైన సమయాల్లో ఇవి రెండు ఆప్ చేసుకోవడం మంచిది. లేకుంటే మీ ఫోన్ హ్యాకయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
  • వైఫై మీరు ఇంటిలోని వైఫై ద్వారా మొబైల్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ కనెక్ట్ కాకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి కేబుల్ కి ఓ యునిక్యూ ఐడీ ఉంటుంది. దాని ద్వారా హ్యకర్లు ఈజీగా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది.
  • యాడ్ బ్లాకర్ ప్రతి ఒక్కరూ యాడ్ బ్లాకర్ కాని పాస్ వర్డ్ మేనేజర్ కాని ఉపయోగించాలి ఎడ్వర్డ్ స్నోడెన్ చెబుతున్నారు. ఇది ధర్డ్ ఫార్టీ కుకీస్ ని కంట్రోల్ చేస్తుందని. మీరు ఏదైనా ఓపెన్ చేస్తే వెంటనే పర్మిషన్ అడుగుతుందని చెబుతున్నారు.
  • జావా స్క్రిప్ట్  మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ల్యాపీకి కాని లేకుంటే మొబైల్ కి కాని లేకుంటే డెస్క్ టాప్ కాని జావా స్క్రిప్ట్ ఉంచుకోవద్దు. ఇది చాలా డేంజర్ తో కూడుకున్నదని స్నోడెన్ చెబుతున్నారు. అవసరమైతే క్యూబ్ ఓఎస్ ఇందుకోసం వాడాలని సూచించారు.
  • ఈమెయిల్ కూడా డేంజరే కమ్యూనికేట్ కావడానికి ఈమెయిల్ స్థానంలో వైర్ కాని లేకుంటే సిగ్నల్ కాని వాడటం మంచిదని చెబుతున్నారు. ఈ మెయిల్ అనేది ఎప్పటికైనా అన్ సేఫ్ అని హెచ్చరిస్తున్నారు.

and also read