చైతూ మూవీకి విడుదల కష్టాలు

Savyasachi Movie Release On Deepavali

చిన్న హీరోల సినిమాలు విడుదల కష్టాలను ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం. కాని నాగచైతన్య వంటి పెద్ద హీరో మూవీ గత కొన్ని నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రం షూటింగ్‌ చాలా రోజుల క్రితమే ముగింపుకు చేరుకుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు. కాని సినిమా విడుదల మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. సవ్యసాచి చిత్రం ప్రారంభం అయిన తర్వాత చాలా ఆలస్యంగా షూటింగ్‌ ప్రారంభం అయిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆగస్టు 31న శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కాని ఇప్పటికి కూడా సవ్యసాచి చిత్రం విడుదలపై క్లారిటీ రావడం లేదు.

savyasachi movie release date

సవ్యసాచి చిత్రాన్ని జూన్‌ మరియు జులై నెలలో ఖచ్చితంగా ఆగస్టు రెండవ వారంలో విడుదల చేస్తామని దర్శకుడు చందు మొండేటి చెప్పుకొచ్చాడు. చైతూ రెండు మూవీలు కూడా ఆగస్టులోనే విడుదల అవుతాయని అంతా భావించారు. సవ్యసాచి కారణంగానే ఆగస్టు 31న శైలజ రెడ్డి అల్లుడును మారుతి ఫిక్స్‌ చేశాడు. చివరకు సవ్యసాచి చిత్రం విడుదలకు డేట్‌ కలవడం లేదు. సెప్టెంబర్‌లో మరియు అక్టోబర్‌లో పెద్ద సినిమాలు ఉన్న కారణంగా నవంబర్‌ వరకు మంచి టైం కోసం చైతూ సవ్యసాచి చిత్రం వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి. తొందరపడి విడుదల చేస్తే పెద్ద నష్టం తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ వారు నిర్మించారు. సినిమా విడుదల విషయంలో వీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో విఫలం అవుతున్నారు.