హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల ఏర్పాట్లలో రాష్ట్ర నాయకత్వం తలమునకలై ఉంది. ఈ ఏర్పాట్లపై కేసీ వేణుగోపాల్ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను ఏఐసీసీ తాజాగా విడుదల చేసింది.
ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం..
1. ఈనెల 16 తేదీన మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ ఇచ్చే లంచ్‌కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు.
2. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అంటే లంచ్ తర్వాత హోటల్ తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది.
3. ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం 17వ తేదీన ఉదయం 10:30 గంటలకు జరగనుంది.
4. సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో సీడబ్ల్యూసీ, అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఏల్పీ నేతలు పాల్గొననున్నారు.
5. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 18వ తేదీన ఎంపీలు మినహా మిగతా నేతలంతా పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రజలకు 5 హామీలతో కూడిన గ్యారెంటీ కార్డులను అందజేయనున్నారు.