పెళ్ళయిన మహిళ మీద స్కూల్ పిల్లాడు వేధింపులు…భర్త మీద దాడి ?

Brother Raped Her Sister

వేధింపులకి ఈ మధ్య వావీ వరసలు కూడా ఉండడం లేదు, తాజాగా పెళ్ళయిన ఒక మహిళను స్కూల్ పిల్లాడు వేధించిన ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని మారుతీనగర్‌లో ఒక మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. రాత్రి 9 గంటలకు సూపర్ మార్కెట్‌లో సామాన్లు కొనుక్కుని రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ ఇంటికి వస్తుండగా 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలుడు ఆమె వెనకాలే వస్తూ విజిల్స్ వేస్తూ పిచ్చి చేష్టలు చేస్తూన్నాడు. కాసేపు సహించిన ఆమె వెనక రాకు అని తరిమింది. ఆ పిల్లాడు ఉండేది ఆమె ఉండే ఇంటికి పక్క వీధిలోనే. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. ఆమె మరీ గట్టిగా బెదిరించకపోవడంతో ఆ పిల్లాడు మరింత రెచ్చిపోయాడు. ఈసారి బూతులు మాట్లాడుతూ ఆమెపై అడ్డమైన కామెంట్లూ చేశాడు. ఇంటికి వెళ్లిన మహిళ జరిగిన విషయాన్ని తన భర్త యోగేష్‌కి చెప్పింది. అతను ఆశ్చర్యపోయాడు. వాణ్ని అలాగే వదిలేస్తే ఇంకా చెడిపోతాడని వాళ్ల ఇంటికి వెళ్లి పెద్ద వారికి చెబుతా అని బయల్దేరాడు. అప్పటికే ఆ పిల్లాడి తండ్రి మునిరాజు తప్పతాగి ఉన్నాడు. యోగేష్ వెళ్లి జరిగింది చెప్పాడు. ఆవేశంలో క్రికెట్ బ్యాట్ తీసి కంప్లైంట్ చేసిన యోగేష్‌నే చితకబాదాడు బాలుడి తండ్రి.