అయ్యో.. స్క్రిప్ట్‌ ఇంకా కాలేదా?

script work not completed on ram charan and ntr multistarrer movie

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనిపిస్తుంది. రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా కనీసం రెండు సంవత్సరాలు అయినా పడుతుంది. అయితే ఎన్టీఆర్‌, చరణ్‌ల మల్టీస్టారర్‌ మాత్రం కాస్త త్వరగానే పూర్తి చేయాలని మొదట భావించాడు. మొదట అనుకున్న జక్కన్న అనుకున్నట్లుగా వేగంగా స్క్రిప్ట్‌ను రెడీ చేయలేక పోతున్నాడు. సినిమా అనుకున్న సమయంలో సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను ఇప్పట్లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశం లేదనిపిస్తుంది. ఇంకా స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో సినిమాను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 300 కోట్లతో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్న దర్శకుడు జక్కన్న స్క్రిప్ట్‌ విషయంలో రాజీ పడటం లేదట.

దాదాపు రెండు నెలల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తు చేసిన జక్కన్న అండ్‌ టీం మరి కొన్ని రోజుల పాటు స్క్రిప్ట్‌పై వర్క్‌ చేయాలని భావిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఎక్కువగా స్క్రిప్ట్‌ వర్క్‌పై శ్రద్ద ఉంటుంది. స్క్రిప్ట్‌ పక్కాగా వచ్చాకే సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్తాడు. బాహుబలి కోసం దాదాపు ఏడు నెలల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ మరియు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ భారీ మల్టీస్టారర్‌కు కూడా దాదాపు ఆరు నెలల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ను చేస్తున్నాడు. మరో వైపు ఈ మల్టీస్టారర్‌ చిత్రం కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ సెట్టింగ్స్‌ నిర్మాణం ప్రారంభం అయ్యాయి. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాకుండానే సెట్టింగ్‌లు వేయిస్తున్న జక్కన్న ప్లానింగ్‌ ఏంటో అర్థం అవ్వడం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు. 2020లో ఈ భారీ మల్టీస్టారర్‌ వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది.