బాలీవుడ్ నటి కోసం ట్రై చేస్తున్న ప్రభాస్

బాలీవుడ్ నటి కోసం ట్రై చేస్తున్న ప్రభాస్

బాహుబలితో దేశవ్యాప్త గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ సాహోతో హిందీ బెల్టులో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఇకపై తన సినిమాలన్నీ ఇండియా వైడ్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని చేయాలని చూస్తున్న ప్రభాస్, ఇకనుంచి తనతో నటించడానికి టాప్ బాలీవుడ్ హీరోయిన్లు మక్కువ చూపిస్తారని భావిస్తున్నాడు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే కూడా బాలీవుడ్ కి సుపరిచితమే కానీ నాగ్ అశ్విన్ తో చేయబోతున్న సూపర్ హీరో సినిమాలో మాత్రం టాప్ బాలీవుడ్ నటి కోసం ట్రై చేస్తున్నారు.

ఈసారి అయినా ప్రభాస్ తో నటించడానికి ఫ్రంట్ లైన్ బాలీవుడ్ హీరోయిన్ దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో, అంతర్జాతీయ శ్రేణిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పది కోట్లు అయినా కానీ పాన్ ఇండియా హీరోయిన్ ఉండాలని గట్టిగా ట్రై చేస్తున్నారు.