ఈసారి వాళ్ళిద్దరికి కుండ మార్పిడేనా ?

Seats Swapping For Kodela And Rayapati

చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఎవరు ఎక్కడి నుంచీ పోటీ చేయాలో ఇప్పటికే ఒక వ్యూహాన్ని రచించారు. రోజు రోజుకి మారుతున్న సమీకరణాలు, రాజకీయ వర్గాలలో వస్తున్న మార్పులు ఏపీలో విభజన హామీలు , హోదా విషయంలో అనుసరిస్తున్న వ్యుహ్యాలు, జనసేన, వైసీపీ నుంచీ వస్తున్న నుంచీ వస్తున్న సవాళ్ళ నేపధ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ కి గెలుపు ఖాయంగా ఉన్న నియోజక వర్గాలలో అదేవిధంగా పార్టీ గెలుపు నాయకుల మార్పుల వల్ల మరింత బలంగా ఉంటుంది అనుకునే స్థానాలలో సర్వేలు చేయిస్తూ ఆయా స్థానాలలో నేతలని ఫిక్స్ చేసేస్తున్నారు.అందులో భాగంగానే అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నుండి రాయపాటి కుటుంబానికి చెందిన వారిని బరిలోకి దింపడానికి ‘చంద్రబాబు’ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

chandrababu And rayapati

అదే విధంగా ఐదు సార్లు నర్సరావుపేట నుంచి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన ‘కోడెల’ను తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నారట. కోడెల మాత్రేమే అక్కడ గెలిచే గెలుపు గుర్రం అని అన్ని పార్టీలకి సరైన ప్రత్యర్ధి అని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అంతే కాకుండా యూపీఏ ప్రభుత్వం అధికారంలో వస్తే కోడెల సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఇప్పించాలని చంద్రబాబు ఆలోచనని సమాచారం.

kodela siva prasad

ఇప్పుడున్న ఎంపీల్లో ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటున్న వారున్నారు. వారికి మంత్రి పదవి ఇస్తే వారి వ్యాపారాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే కోడెలకు ఇస్తే రాష్ట్రం కోసం కృషి చేస్తారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2014 లోనే కోడెలను నర్సరావుపేట ఎంపీగా పంపుదామని చంద్రబాబు భావించినా ఆఖరి నిమిషంలో రాయపాటి టీడీపీలో చేరడంతో ఆయనకు సీటు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి రాజకీయ పరిస్థితి కన్నా ఇప్పటి పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సీనియర్‌ నేతగా గుర్తింపు ఉన్న కోడెలను ఎంపీగా పోటీ చేయిస్తే మంచిదేనని లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఒకవేళ కోడెల నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే తన కుమారుడ్ని అసెంబ్లీకి పోటీ చేయించాలని కోరవచ్చు. .ఒకే ఇంటి నుంచి ఇద్దరికి అవకాశం చంద్రబాబు ఇస్తారా అనేది సందేహమే అయితే పార్టీ ఎక్కడి నుంచీ పోటీ చేయమని నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానని ‘కోడెల’ చెబుతున్నారు. అయితే కోడెల కుటుంభం పై వస్తున్న అవినీతి ఆరోపణలు ఆయన గెలుపుపై ప్రభావం చూపుతాయి అని, ‘కోడెల’ చాలా విషయాలలో మౌనం వహించడం ఆయన భవిష్యత్తుకే కాకుండా పార్టీ పై కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మరి ముందు ముందు సమీకరణాలు ఇంకెలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి..