ప్చ్… ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీలో చేస్తుంది ఇంత చిన్న పాత్రే…!

Priyanka-Chopra-New-Movie-I

ప్రియాంక చోప్రా బాలీవుడ్ కి బై బై చెప్పిన విషయం తెలిసిందే. చివరగా తను 2016 లో వచ్చిన జై గంగాజల్ అనే హిందీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ లో క్వాంటికో అనే వెబ్ సిరీస్ తో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, 2017లో బేవాచ్ అనే ఇంగ్లీష్ చిత్రంతో హాలీవుడ్ సినిమా తెరలలో కనిపించింది. ఆ వెంటనే వరుసగా ఏ కిడ్ లైక్ జాక్, ఇజంట్ ఇట్ రొమాంటిక్?, ది స్కై ఇజ్ పింక్ వంటి సినిమాలకి సైన్ చేసింది. 2018 లో విడుదలైన ఏ కిడ్ లైక్ జాక్ సినిమాని ప్రియాంక చోప్రా కోసమే చూసిన ఆమె అభిమానులు, ఆమె చేసింది ఎటువంటి ప్రాధాన్యత లేని అతిచిన్న పాత్ర కావడంతో నిరుత్సాహపడ్డారు.

ISN'T-IT-ROMANTIC-movie

పోనీ తన నెక్స్ట్ హాలీవుడ్ సినిమాలో ఖచ్చితంగా బెస్ట్ రోల్ చేస్తుంది అని ఆశగా ఎదురుచూస్తున్న ఆమె అభిమానుల ఆశలన్ని, ఇజంట్ ఇట్ రొమాంటిక్? సినిమా ట్రైలర్ చూశాక నీరుగారిపోవడం ఖాయం.ఇజంట్ ఇట్ రొమాంటిక్? సినిమా ట్రైలర్ విషయానికి వస్తే, ఈ సినిమా నటాలీ అనే ఫ్యాట్ గర్ల్ చుట్టూ తిరిగే కథ. రెబెల్ విల్సన్ ఈ సినిమాలో నటాలీ గా నటించింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ సినిమా ట్రైలర్ లో యోగ అంబాసడర్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా కనిపించింది 5 సెకన్ల లోపే. అదికూడా అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలానే కనిపిస్తుంది.

Priyanka-Chopra-New-Movie

అయినా, హాలీవుడ్ కుర్రహీరో నిక్ జోనస్ తో ప్రేమలో పడి , పెళ్ళికి సిద్ధం అవుతున్న ప్రియాంకని చూస్తుంటే, హాలీవుడ్లో పెద్ద స్కెచ్ యే వేస్తుందని అనిపిస్తుంది. ఏదేమైనా ఇలా కనపడి కనపడనట్టు కనిపిస్తున్న హాలీవుడ్ సినిమాలతో విసుగెత్తుతున్న ప్రియాంక చోప్రా అభిమానులు, మళ్ళీ తమ అభిమాన నటిని బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది అనే గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.