ఈసారి ఆ అసెంబ్లీ బరిలో నారాయణ…!

Minister Narayana To Contest From Nellore City

కారణాలు ఏమైనా కానివ్వండి తెదేపా ఆవిర్భావం నుంచి నెల్లూరు పార్లమెంట్ స్థానంపై పట్టు సాధించలేకపోయింది. ఎదో రేను సార్లు గెలిచినా అది గెలుపోటముల ప్రభావాన్ని నిర్ణయించేంత మాత్రం కాదు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరెడ్డి కేవలం 13 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవటంతో రానున్న ఎన్నికల్లో గెలుపు కెరటం ఎగురవేసేందుకు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో కూడా ఆదాల ప్రభాకరెడ్డికే టికెట్ కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. దీనికి సంబంధించి పార్టీ ముఖ్యుల నుంచి సమాచారం అందటంతో అమరావతికి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.

minister-narayana-nellure

గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో చోటు చేసుకున్న లోపం కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బలమైన అభ్యర్థులను నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా బరిలో దింపితే పోటీకి సిద్ధమని పార్టీ అధినేత దగ్గర ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరం, గ్రామీణ నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థులను దించటం ద్వారా ఆయా నియోజకవర్గాలలో పట్టు సాధించటంతో పాటు దీని ప్రభావం పార్లమెంటుపై పడుతుందని అందుకే సీఎం చంద్రబాబు నెల్లూరు నగరం నుంచి కచ్చితంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా, అన్ని విధాలా బలమైన అభ్యర్థి కోసం పలువురు పేర్లను పరిశీలించిన చంద్రబాబు చివరికి మంత్రి పొంగూరు నారాయణ అయితే బాగుంటుందని ఆయననే ఈ సారి బరిలో దింపాలని భావిస్తున్నారట. పార్లమెంటు అభ్యర్థిగా నున్న ఆదాల కూడా నారాయణ అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో సీఎంను కలిసిన సమయంలో నెల్లూరు నగరం నుంచి పోటీకి సిద్ధం కావాలని మంత్రి నారాయణకు సూచించారట. అంతేకాకుండా ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల విషయంలో కూడా అభ్యర్థులుగా ఎవరిని బరిలో దించాలన్న విషయమై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ విషయం మీద మరి కొద్ది రోజుల్లో క్లారిటీ రావచ్చని సమాచరం.

chandrababu-narayana