తెలుగు బిగ్‌బాస్ టీఆర్పీని పెంచేందుకు నిర్వాహకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి సీజన్‌తో పోల్చితే రెండవ సీజన్ టీఆర్పీ చాలా తక్కువగా ఉంది. దాంతో మొదటి నుండే మసాలా దట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా బిగ్‌బాస్‌ను తెలుగు ఆడియన్స్ ఆధరించడం లేదు. వరుసగా ట్విస్ట్‌లు, టాస్క్‌లు ఇస్తున్నా, నాని మంచి గేమ్స్‌ను ఇంటి సభ్యులతో ఆడిస్తున్నా కూడా బిగ్‌బాస్‌ను చూసే ప్రేక్షకుల సంఖ్య పెరగడం లేదు. మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగిన విషయం తెల్సిందే. ఇక రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. ఈ వారం లేదా వచ్చే వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక స్టార్‌ను ఇంట్లోకి పంపించే అవకాశం కనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న రెండవ సెలబ్రెటీ వల్ల ఖచ్చితంగా షోకు అదనపు ఆకర్షణ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
బిగ్‌బాస్ మొదటి సీజన్లో ఇంట్లో సభ్యులు ఎక్కువ శాతం మంచి సెలబ్రెటీలు, గుర్తింపు ఉన్న వారు అవ్వడం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి తారు మారుగా ఉంది. ఒక్కరు ఇద్దరు మినహా ఏ ఒక్కరు కూడా పెద్దగా గుర్తింపు ఉన్న సెలబ్రెటీలు కాదు. వారిని ప్రేక్షకులు గతంలో కొందరు చూడనే లేదు. అందుకే ప్రేక్షకులు ఈ షోను ఆధరించడం లేదనే టాక్ వినిపిస్తుంది. దాంతో పాటు నాని హోస్టింగ్‌ను కూడా ప్రేక్షకులు ఆధరించడం లేదు. ఎన్టీఆర్‌ను చూసిన వారు నానిని చూడలేక పోతున్నారు. అందుకే ఈ సీన్‌కు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాకపోవడం జరుగుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా షోకు ఊపు తీసుకు రావాలని భావిస్తున్నారు. మరో ఇద్దరు లేదా ముగ్గురు బిగ్‌బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని స్టార్ మా వారి నుండి అనధికారికంగా సమాచారం అందుతుంది.