అందాల తార శ్రీలీల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోయిన్ శ్రీలీల ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకుంది చాలామంది హీరోల పక్కన నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈమె డాన్స్ గురించి చెప్పుకునే తీరాలి. శ్రీలీల డాన్స్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. రీసెంట్గా మహేష్ బాబు గుంటూరు కారం మూవీ లో కుర్చీ మడత పెడతా డాన్స్ వేసి అదరగొట్టింది .
చిన్న వయసులోనే ఇంత గుర్తింపుని తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. తను ఫిజికల్ మెంటల్ హెల్త్ రెండిటిని కూడా ఆమె బ్యాలెన్స్ చేస్తుందట. అందుకు ఈమె ప్రతిరోజు రాత్రి 45 నిమిషాలు తప్పకుండా యోగా చేస్తుందట. ప్రతిరోజు ఉదయం కొబ్బరి నీళ్లు తాగుతుందట తర్వాత వెజిటేబుల్స్ సాండ్ విచ్ తీసుకుంటుందట. ఏదైనా ఒక పండు, సలాడ్. బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటుందట కూరలు పప్పు బ్రౌన్ రైస్ సలాడ్స్ వంటివి తింటుందట. సాయంత్రం కాఫీ నైట్ వెజిటేబుల్ సూప్ కానీ సలాడ్ కానీ తీసుకుంటుందట .