కోరిక బలమైనదైతే..అది నెరవేర్చుకోవాలన్న కసి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన రామ్జల్ మీనా. కృషి, పట్టుదల, కష్టించే తత్వం ఉంటే విజయం మీ సొంతం అవుతుందనడానికి రామ్జల్ మీనా చక్కటి ఉదాహరణ. అవును యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన రామ్జల్మీనా ఇపుడు అదే యూనివర్సిటీలో తనకిష్టమైన భాషను చదివేందుకు అర్హత సాధించాడు. రష్యన్ భాష చదివేందుకు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో రామ్జల్ మీనా ఉత్తీర్ణత సాధించాడు.
ఓ వైపు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే జేఎన్‌యూలో రష్యన్ లాంగ్వేజ్ కోర్సు చదివేందుకు అర్హత పొందాడు రామ్జల్ మీనా. మీడియా అతన్ని పలకరించగా..రష్యా దేశమంటే తనకెంతో ఇష్టమని, రష్యన్ భాష నేర్చుకుని తప్పనిసరి ఒక్క రోజైనా రష్యాను సందర్శిస్తానని అంటున్నాడు రామ్జల్ మీనా. బీఏ రష్యన్ లాంగ్వేజ్ చదవడం కోసం ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించా. ఇపుడు నేను జేఎన్‌యూలో వచ్చే ఐదేళ్లు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుంటా. ఒక్క రోజైనా రష్యాకు వెళ్లాలని ఉంది. రష్యన్ సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. రష్యా మంచి దేశం. రష్యా నుంచి భారత్ ఎన్నో రక్షణ సామాగ్రిని కొనుగోలు చేస్తుంటుందన్నాడు.