Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటి ఎన్టీఆర్, అక్కినేని సరసన ఎన్నో చిత్రాల్లో నటించిన ఒకప్పటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూశారు. 83 ఏళ్ళ వయసున్న ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1933, మార్చి 6 న పశ్చిమబెంగాల్ లో పుట్టిన కృష్ణకుమారి దక్షిణాది చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడమే కాదు. తనదైన ముద్ర బలంగా వేశారు. తెలుగులో ఆమె 100 కి పైగా సినిమాల్లో నటించారు.
అందులో కులగోత్రాలు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, చిక్కడు దొరకడు, బందిపోటు, శ్రీకృష్ణావతారం, చదువుకున్న అమ్మాయిలు, పిచ్చి పుల్లయ్య, ఆప్తమిత్రులు, బంగారు భూమి లాంటి చిత్రాల్లో మంచి పేరు వచ్చింది. దక్షిణాది చిత్రాల్లో రాణించిన కృష్ణకుమారి బెంగుళూరు కి చెందిన అజయ్ మోహన్ ని పెళ్లాడారు. ఆ దంపతులకు దీపిక అనే అమ్మాయి వుంది. ఇక కృష్ణకుమారి పెద్ద అక్క కూడా షావుకారు జానకి పేరుతో దక్షిణాదిన అందరికీ చిరపరిచితమే.