కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్న సీనియర్

senior hero contesting for junior heros

ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన వెంకటేష్ ఎఫ్ 2 హిట్ తో కుర్ర హీరోల‌తో కూడా పోటీ పడి సినిమాలు రెడీ చేస్తున్నారు. మొన్న ఎఫ్‌2 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన వెంకీ త్వ‌ర‌లో వెంకీమామ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా మీద కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ మూవీ విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తర్వాత వెంకీ బాలీవుడ్ చిత్రం దేదే ప్యార్ దే చిత్రం రీమేక్ చేయ‌నున్నాడ‌ట‌. వీటితో పాటు ‘నేను లోకల్, సినిమా చూపిస్తా మామ’ ఫేమ్ త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో ఓ చిత్రం ఉంటుందట. అలాగే ఆయన మరో సినిమా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాలు అన్నిటినీ సురేష్ బాబు నిర్మిస్తారట. వీటిని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఈ వార్త‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే రానున్న రోజుల‌లో వెంకీ వ‌రుస సినిమాల‌తో ఫుల్ సంద‌డి చేయ‌నున్నాడ‌నేది అర్ధం అవుతోంది. మరి ఆయన నుండి రానున్న మల్టీ స్టారర్ ఏమవుతుందో చూడలి మరి.