Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొత్తం మీద రాష్ట్రపతి ఎన్నికల్లో ఫెయిలైన విపక్షాలు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం సక్సెస్ అయ్యాయి. ఏదోలా గోపాలకృష్ణ గాంధీ గెలుస్తారని కాదు గానీ.. కనీసం విపక్షాల ఐక్యత అనే విషయం చర్చనీయాంశమౌతుందని కాంగ్రెస్ ఆశ. అందుకే తమకు ఇష్టం లేకపోయినా గోపాలకృష్ణ గాంధీని అభ్యర్థిగా ప్రకటించడానికి అంగీకరించింది. ఇదే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒప్పుకుని ఉంటే.. నితీష్ కూడా గోపాలకృష్ణకే మద్దతిచ్చేవారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా విపక్షాల ఐక్యత కొనసాగాలంటే.. ప్రియాంకను రంగంలోకి దించారని కోరుతున్నాయి ప్రతిపక్షాలు. రాహుల్ నేతృత్వంలో మోడీని ఎదిరించలేమని, ప్రియాంక అయితే తురుపుముక్కగా ఉంటారని చెబుతున్నారు. పైగా ఆమెను చూస్తే ఇందిర గుర్తొస్తున్నారని. ప్రజలు కూడా మనసు మార్చుకుని యూపీయేకు ఓటేస్తారని చెబుతున్నారు.
లాలూ, పవార్ లాంటి సీనియర్ నేతలు కూడా ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నారట. వీలైనంత త్వరగా ఆమెను రంగంలోకి దించితే మోడీ హవాకు ఎంతో కొంత బ్రేకేయగలమని వాళ్లు సోనియాకు నచ్చజెబుతున్నారు. కానీ సోనియా మాత్రం చేజేతులా కొడుకుని కాదనలేకపోతున్నారు. కానీ సీనియర్లు మాత్రం రాహుల్ కు ఇప్పటికే చాలా టైమిచ్చామని, ఇంకా ఎక్కువిస్తే పార్టీకి కూడా టైమైపోతుందని హెచ్చరిస్తున్నారట.
మరిన్ని వార్తలు: