కర్నాటక సంక్షోభం రోజు రోజుకు ముదురుతున్నది. ఇవాళ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఆర్.రోషన్ బెయిగ్ రాజీనామా చేశారు. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 14కు చేరుకున్నది. ఇందులో 11 మంది కాంగ్రెస్ సభ్యులు, మరో ముగ్గురు జేడీఎస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్‌ను ప్రత్యేకంగా కలిసి, రాజీనామాను సమర్పించినట్లు బెయిగ్ చెప్పారు. హజ్‌కు వెళ్తున్నాని, ముంబైకో లేదా గోవాకో వెళ్లడం లేదన్నారు. బీజేపీలో బెయిగ్ చేరనున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం 21 మంది కాంగ్రెస్, 9 మంది జేడీఎస్ మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.