Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో వేసుకున్న డ్రస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కొందరు నెటిజన్లు ఆమె డ్రస్ అమోఘమని…ఆమె ఓ అద్భుతమని పొగుడుతుండగా…మరికొందరు మాత్రం చిరుతపులి రెడ్ కార్పెట్ పై నడిచినట్టు ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 69వ ఎమ్మీ అవార్డు వేడుకలను భారతీయులు ఈ సారి ఆసక్తిగా తిలకించారు. హాలీవుడ్ లో బిజీ అయిన ప్రియాంక చోప్రా ఆ వేడుకలకు హాజరవుతుండటమే అందుకు కారణం. ప్రియాంక ఎలాంటి డ్రెస్ లో కనిపిస్తుందో..ఎంత అందంగా ఉంటుందో అని ఆమె అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఒంటికి అతుక్కుపోయినట్టుగా ఉండి తెల్లగా మెరుస్తున్న పెద్ద గౌనులో రెడ్ కార్పెట్ మీద ప్రియాంక చోప్రా నడిచిరాగానే టీవీల్లో ఆమెను చూసిన అభిమానులు ఉప్పొంగిపోయారు. చేపను పోలిన డ్రెస్ లో ప్రియాంక ఏంజెల్ లా ఉందంటూ అభిమానులు ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ప్రియాంక శిల్పంలా ఉంది అని ఓ అభిమాని అంటే…ఎమ్మీ అవార్డుల్లో బెస్ట్ డ్రస్ అవార్డు ప్రియాంకకే..మిగతా వాళ్లు ఇళ్లకు వెళ్లిపొండి అని కొందరు, ప్రియాంకను మించి రెడ్ కార్పెట్ మీద ఎవరూ అందంగా కనిపించటం లేదని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ప్రియాంక బీన్ బ్యాగ్ వేసుకొచ్చినా…ఆమెకే బెస్ట్ డ్రెస్ అవార్డు వస్తుందని ఇంకొందరు నెటిజన్లు పొగిడారు. అదే సమయంలో ప్రియాంక చోప్రా డ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన నెటిజన్లూ ఉన్నారు. అది డ్రెస్సా లేక…మెరిసిపోయే దుప్పటా అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..మరొకరు స్వచ్ఛ భారత్, స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాల ప్రచార కర్తలా ఉందని వ్యాఖ్యానించారు. లాస్ ఏంజిల్స్ లో ఓ మంచు చిరుత కనిపించడం లేదు అని తెలిసింది…రెడ్ కార్పెట్ పై ఉంది ఆ చిరుతేనా అని ఒకరు ట్వీట్ చేశారు. ఇదేదో పెద్ద గద్దలా ఉందే అని మరకొరు ట్వీట్ చేశారు. మొత్తానికి ఎమ్మీ అవార్డ్స్ లో తన డ్రెస్ తో ప్రియాంక అందరి దృష్టినీ ఆకర్షించారు.