తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. దాసోజు శ్రవన్ , కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫారసులను తిరస్కరించింది. ప్రస్తుతం గవర్నర్ తమిళి సై తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు ఎమ్మెల్సీలు సంగారెడ్డి జిల్లాకు చెందిన సత్యానారాయణ కుర్రా సత్యానారయణ జనతా పార్టీ, బీజేపీ పార్టీలో పని చేశారు. 2018 వరకు బీజేపీలోనే ఉన్న సత్యనారాయణ బీఆర్ఎస్ లో చేరాడు.
అదేవిధంగా బీసీ వర్గాల బలమైన నేత ప్రజారాజ్యంలో బలమైన నేతగా పేర్గాంచిన దాసోజు శ్రవణ్ ప్రజారాజ్యంలో కొంత కాలం పని చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరాడు. ప్రభుత్వం గవర్నర్ కోటా కింద వీరిని ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తమిళి సై తిరస్కరించింది. ఆర్టికల్ 171 (5)- ప్రకారం ఈ అభ్యర్థులకు తగిన అర్హత లేదన్నారు. ఈ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం తన వద్దకు రాలేదని తెలిపారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని.. అలా చేయడం ఆర్టికల్ 171 (5)కి విరుద్దం అని ముఖ్యమంత్రికి, కేబినెట్‌కు సూచించారు. తెలంగాణ గవర్నర్ తాజాగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించడంతో హాట్ టాపిక్ గా మారింది.