అప్పట్లో సూర్య, జ్యోతిక జంటగా ‘కాకా కాకా’ తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ మీనన్ మంచి హిట్ కొట్టాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్‌గా ‘ఘర్షణ’ పేరుతో వెంకటేష్, అసిన్ లను పెట్టి చేశాడు. ఈ రెండు భాషల చిత్రాలకు గౌతమ్‌మీననే దర్శకుడు. హరీస్‌జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా తమిళంలో ఆడినట్లుగా తెలుగులో పెద్దగా ఆడకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం లభించాయి. దాంతో 16 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఆ పోలీస్ ఆఫీసర్ ఏమి చేస్తున్నాడు? అనే పాయింట్‌తో గౌతమ్ దీనికి సీక్వెల్ తీయనున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ లైన్‌కి సూర్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. అయితే ప్రస్తుతం గౌతమ్ విశాల్ తో ఓ చిత్రం చేయాల్సివుంది. మరోవైపు సూర్య ‘ఎన్జీకే'(నందగోపాలకృష్ణ)- కాప్పన్ సినిమాల బిజీలో ఉన్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాత ‘కాకా కాకా’కి సీక్వెల్ పట్టాలెక్కనుందని అంటున్నారు. అయితే ‘కాకా కాకా’ నాటికి సూర్యకి తెలుగులో ఇమేజ్, మార్కెట్ రెండూ లేవు దాంతో అప్పట్లో వెంకీతో రీమేక్ చేశారు. కానీ ప్రస్తుతం సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ఉంది, మార్కెట్ కూడా ప్రభావిత స్థాయిలోనే ఉంది. కాబట్టి ఇందులోని ‘డిసిపి రామచంద్ర ఐపిఎస్’ని తెలుగులో వెంకీతో రీమేక్ చేయరు తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్య-గౌతమ్‌ల సీక్వెల్ విడుదలయ్యే అవకాశం ఉంది.