బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు క్యాన్సర్ సోకినట్లు రెండుమూడు రోజులుగా వార్తలు చక్కర్లు విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటిస్తున్న షాహిద్ షూటింగ్ కు లాంగ్ బ్రేక్ తీసుకోవడంతో..అతనికి ఉదర క్యాన్సర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అతని అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఈ వార్తలపై తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా స్పష్టత ఇచ్చాడు షాహిద్. తాను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని అవాస్తవ విషయాలను నమ్మకండని స్పష్టత ఇచ్చాడు.
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ షూటింగ్ నుంచి విరామం తీసుకున్న షాహిద్ కపూర్ ప్రస్తుతం ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. కొత్త సంవత్సర వేడుకల తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు షాహిద్. అయితే ఆయన ఎంజాయ్మెంట్ కోసం బ్రేక్ తీసుకుంటే కేన్సర్ అంటగట్టేసింది మన సోషల్ మీడియా.