నాగచైతన్య, మారుతిల కాంబినేసన్లో తెరకెక్కిన ‘శైలజరెడ్డి అల్లుడు’ చిత్రం ఈనెల 31న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేయడం జరిగింది. రీ రికార్డింగ్ వర్క్ పూర్తి కాని కారణంగా సినిమాను విడుదల చేయలేక పోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇక ఈ చిత్రం విడుదల కొత్త తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. కనీసం రెండు మూడు వారాలు అయినా ఈ చిత్రం విడుదలకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అందుకే ముందుగా అనుకుని చిత్రీకరించని సీన్స్‌ను ఇప్పుడు చిత్రీకరించేందుకు మారుతి సిద్దం అవుతున్నాడు. రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్లతో నాగచైతన్య కామెడీ సీన్స్‌ను మారుతి చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఈమద్య కాలంలో కామెడీ బాగుంటేనే సినిమా బాగుంటుంది.. అందుకే ఈ చిత్రానికి వెన్నెల కిషోర్ కామెడీని పెంచాలని మారుతి భావిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌తో కామెడీ సీన్స్ డోస్‌ను పెంచుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల ఆలస్యం అవుతున్నా కూడా కామెడీ డోస్‌ను పెంచి చిత్రంపై మరింతగా అంచనాలను మారుతి పెంచుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమంత నటించిన ‘యూటర్న్’ చిత్రం విడుదల అయిన వారం రోజుల తర్వాత శైలజ రెడ్డి అల్లుడు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై నిర్మాతలు లేదా నాగ చైతన్య క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రంలో చైతూకు జోడీగా అను ఎమాన్యూల్ నటించిన విషయం తెల్సిందే.