అక్కినేని నాగచైతన్య, అను ఎమాన్యూల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం గురించి గత రెండు రోజులుగా తెగ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. కేరళలో వర్షాల కారణంగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న టైంకు పూర్తి కాలేదు అని, దాంతో సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై నాగచైతన్య స్పందించాడు. శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానందున వాయిదా వేస్తున్నట్లుగా స్వయంగా చైతూ ట్వీట్ చేయడం జరిగింది. రీ రికార్డింగ్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేయడం చాలా విచారకరం అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుతి గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అదే దారిలో ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా ఆశించారు. కాని అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా పడటం జరిగింది.
‘బాహుబలి’ చిత్రం తర్వాత చాలా పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ ఈ చిత్రంలో నటించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం టీజర్ అంచనాలను పెంచేసింది. తాజాగా ఆడియో విడుదల కూడా జరిగిపోయింది. భారీ ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించాలని భావించారు. కాని మారుతి కేరళలో ఉండటం వల్ల ఆడియో విడుదల కార్యక్రమంను క్యాన్సిల్ చేయడం జరిగింది. పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. త్వరలోనే సినిమా తేదీని అనౌన్స్ చేసి, ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పొగరుబోతు అత్త, ఆ అత్తకు తగ్గ అల్లుడు కాన్పెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్ సభ్యులకు కేరళ వరదలు పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టాయి.